తెలుగు

మీ యుటిలిటీ బిల్లులు చెల్లించడంలో సహాయం కావాలా?

కోవిడ్-19 సమయంలో మీరు మీ విద్యుత్, సహజ వాయువు లేదా నీటి బిల్లులు చెల్లించలేకపోతే, మీకు సహాయం లభిస్తుంది.

మీ యుటిలిటీ కంపెనీకి కాల్ చేయండి. ఈ రెండు ప్రశ్నలు అడగండి:

  • మీరు ఏ సహాయ కార్యక్రమాలకు అర్హులు?
  • మీ గత బకాయిలపై మీరు చెల్లింపు ప్రణాళికను ఏర్పాటు చేయవచ్చా?

మీ విద్యుత్, సహజ వాయువు లేదా నీటి యుటిలిటీని సంప్రదించడానికి సహాయం కావాలా? ఈ పేజీలోని మ్యాప్‌లో మీ అడ్రస్ ఎంటర్ చేయండి: https://www.commerce.wa.gov/utility-assistance/.

యుటిలిటీ బిల్లులు చెల్లించడంలో ప్రజలకు సహాయపడే సమాఖ్య కార్యక్రమానికి మీరు అర్హత పొందవచ్చు.

మీ ఆదాయాన్ని బట్టి, “LIHEAP” (లో-ఇన్‌కం హోమ్ ఎనర్జీ అసిస్టెన్స్ ప్రొగ్రామ్) అని పిలవబడే సమాఖ్య కార్యక్రమానికి అర్హులు కావచ్చు. నీటి బిల్లుల కోసం ఒక కొత్త, అలాంటి కార్యక్రమమే అభివృద్ధి చేయబడుతూ ఉంది. ఆదాయ స్థాయిలకు అర్హత సాధించడానికి ఇవి కొన్ని ఉదాహరణలు:

  • కుటుంబం పరిమాణం 1 వ్యక్తి = ఆదాయం నెలకు $1,595 కంటే తక్కువ లేదా సంవత్సరానికి $19,140
  • కుటుంబం పరిమాణం 2 వ్యక్తులు = ఆదాయం నెలకు $2,155 కంటే తక్కువ లేదా సంవత్సరానికి $26,860
  • కుటుంబం పరిమాణం 4 వ్యక్తులు = ఆదాయం నెలకు $3,275 కంటే తక్కువ లేదా సంవత్సరానికి $39,300

సమాచారం కోసం, 2-1-1 కు కాల్ చేయండి లేదా మీరు నివసించే స్థానిక “కమ్యూనిటీ యాక్షన్ ఏజన్సీ” కి కాల్ చేయండి. సంప్రదింపు సమాచారం తెలుసుకోవడానికి ఈ మ్యాప్ ఉపయోగించండి: https://fortress.wa.gov/com/liheappublic/Map.aspx

ఇతర ఖర్చుల కోసం సహాయపడటానికి వనరులు అందుబాటులో ఉన్నాయి. సమాచారం కోసం 2-1-1 కు కాల్ చేయండి.

ఈ మహమ్మారి వాషింగ్టన్‌లోని అనేక మందికి అనుకోని బిల్లులు వచ్చేలా చేసింది. ఇది మీకు ఒక్కరికే కాదు. అద్దె, ఆహారం, బ్రాడ్‌బ్యాండ్ మరియు ఇలాంటి మరెన్నో చెల్లించడంలో ప్రజలకు సహాయపడే కార్యక్రమాలతో మిమ్మల్ని కనెక్ట్ చేయగల ఎవరితోనైనా మాట్లాడటానికి 2-1-1 కు కాల్ చేయండి.

Last Updated 2021-06